మ్యాడ్ రెస్పాన్స్ తో ‘రా మచ్చా మచ్చా’ సాంగ్.!


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం మెగా అభిమానుల్లో అవైటెడ్ సినిమాగా నిలిచి ఇప్పుడు రిలీజ్ కి దగ్గరకి వస్తుంది. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ ఒకో అప్డేట్ ని రివీల్ చేస్తూ వస్తుండగా రీసెంట్ గానే సినిమా రెండో సాంగ్ గా పక్కా మాస్ సాంగ్ రా మచ్చా మచ్చా ని విడుదల చేశారు.

మరి ఈ సాంగ్ అయితే ఇప్పుడు భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. విడుదల చేసిన ఈ కొన్ని రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్ కి పైగా వ్యూస్ ని ఈ సాంగ్ క్రాస్ చేసేసి మ్యూజిక్ లవర్స్ లో చార్ట్ బస్టర్ గా మారిపోయింది. ఇక బిగ్ స్క్రీన్స్ పై అయితే ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version