ఆఫ్ లైన్లో డాషింగ్ లుక్స్ తో అదరగొట్టిన “గేమ్ ఛేంజర్”

ఆఫ్ లైన్లో డాషింగ్ లుక్స్ తో అదరగొట్టిన “గేమ్ ఛేంజర్”

Published on Dec 21, 2024 9:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ పొలిటికల్ డ్రామా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. కొంచెం లేట్ అయ్యినా ఈ సినిమాపై ఇపుడు అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ఇపుడు యూఎస్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఇక్కడ చేరుకున్న గ్లోబల్ స్టార్ కి గ్రాండ్ వెల్కం కూడా అక్కడి ఆడియెన్స్ అందించారు. మరి అక్కడి నుంచి చరణ్ డాషింగ్ లుక్స్ అయితే ఇపుడు వైరల్ గా మారాయి. రీసెంట్ గానే చరణ్ మాల తీసిన సంగతి తెలిసిందే. దీనితో తన మేకోవర్ కి ఆఫ్ లైన్ లో మళ్లీ మంచి రెస్పాన్స్ వస్తుంది. మాములుగానే చరణ్ ఆఫ్ లైన్ లుక్స్ కి కూడా సెపరేట్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఈ కొత్త లుక్ కూడా ఇపుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు