“గేమ్ ఛేంజర్” ర్యాంపేజ్.. 1 గంటలో 1 కోటి గ్రాస్

“గేమ్ ఛేంజర్” ర్యాంపేజ్.. 1 గంటలో 1 కోటి గ్రాస్

Published on Jan 9, 2025 11:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సాలిడ్ పొలిటికల్ కమర్షియల్ డ్రామా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎంతో కాలం ఎదురు చూపులు తర్వాత ఎట్టకేలకి ఈ సినిమా రిలీజ్ కి వచ్చేస్తుంది. అయితే ఈ సినిమా బుకింగ్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో పెద్ద సస్పెన్స్ వాతావరణమే నడిచింది.

ఇలా అర్ధ రాత్రి సమయంలో అలా బుకింగ్స్ ని ఓపెన్ చేయగా హైదరాబాద్ సిటీలో గేమ్ ఛేంజర్ ర్యాంపేజ్ చూపించాడు. ఇలా కేవలం ఒక్క గంటలోనే 1 కోటి గ్రాస్ ని కలెక్ట్ చేసి సినిమా అదరగొట్టింది. ఆల్రెడీ చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడిపోగా మరిన్ని ప్రాంతాల్లో సినిమా బుకింగ్స్ మంచి ఫాస్ట్ ఫీలింగ్స్ లో ఉన్నాయి. దీనితో గేమ్ బుకింగ్స్ లేట్ గా మొదలైనా సాలిడ్ స్పీడ్ తో పూర్తవుతున్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు