గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కించగా ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు.
అయితే, ఈ సినిమా టికెట్ బుకింగ్స్ నెల్లూరు సిటీలో ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ డే 1 ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. 103 షోలకు గాను రూ.1.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ‘గేమ్ ఛేంజర్’ మూవీ క్రేజ్ ఏమిటో అందరికీ అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా ఎస్.జె.సూర్య విలన్ పాతరలో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.