గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాపై ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ మంచి క్రేజ్ నెలకొంది.
ఓవర్సీస్ అనగానే యూఎస్ బాక్సాఫీస్ గురించి మాట్లాడుకుంటారు అందరు. కానీ, ‘గేమ్ ఛేంజర్’ ఈసారి అమెరికాతో పాటు ఇతర దేశాలపై కూడా కన్నేశాడు. ముఖ్యంగా యూకే లో ‘గేమ్ ఛేంజర్’ తన క్రేజ్ చూపిస్తున్నాడు. ఆ దేశంలోనే తొలిసారి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో స్పెషల్ ఫ్యాన్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ స్పెషల్ షోలకి సంబంధించిన టికెట్లు అప్పుడే అమ్ముడు కావడం ఈ సినిమాపై అక్కడ ఎలాంటి క్రేజ్ నెలకొందో చెబుతోంది.
ఏదేమైనా ట్రెండ్ సెట్టింగ్ చేస్తూ ‘గేమ్ ఛేంజర్’ యూకేలో తన క్రేజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.