గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో అనుకున్న స్థాయిలో అంచనాలు క్రియేట్ చేయలేదనే టాక్ వినిపిస్తుంది. దీంతో మేకర్స్ ఈసారి సాలిడ్ ప్రమోషనల్ కంటెంట్‌ను వదలాలని చూస్తున్నారు. ఈ మేరకు ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను పర్ఫెక్ట్ కట్‌తో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే, ఈ ట్రైలర్ ‘గేమ్ ఛేంజర్’పై నెలకొన్న అంచనాలను అమాంతం నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా చిత్ర యూనిట్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారట.
ఈ చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఎక్కడ చేయనున్నారు.. ఎవరు గెస్ట్‌గా వస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.