గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్” ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా ఇది కాగా ఫైనల్ గా రిలీజ్ కి మేకర్స్ తీసుకోచేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ కి కూడా తెచ్చేసారు. అయితే ఈ ట్రైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యిందని చెప్పడంలో సందేహం లేదు.
దీనికి ముందు అంతా ఎక్కడో కొన్ని అనుమానాలు చాలా మందికి ఉండి ఉండొచ్చు కానీ ట్రైలర్ తో మాత్రం దర్శకుడు శంకర్ హీరో రామ్ చరణ్ లు మొత్తం గేమ్ ని మార్చేసారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈ ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. అంతే కాకుండా చాలా మంది రిపీట్స్ లో చూస్తుంటే ఇంకా ఎక్కేస్తుంది అంటున్నారు.. ఇలా మొత్తనికి గేమ్ ఛేంజర్ ట్రైలర్ మాత్రం మొత్తం గేమ్ ఛేంజ్ చేసేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది అని చెప్పాలి.