ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి రాబోతున్న మొట్ట మొదటి చిత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” అనే చెప్పాలి. మరి లేట్ గా బుకింగ్స్ స్టార్ట్ అయినప్పటికీ సాలిడ్ నంబర్స్ ఆల్రెడీ సినిమాగా బుకింగ్స్ లో మొదలవుతున్నాయి. ఇలా గేమ్ ఛేంజర్ హవా మొదలు కాగా ఇపుడు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ టార్గెట్ కోసం తెలుస్తుంది.
దీనితో ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఛేంజర్ 220 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ టార్గెట్ తో రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో సినిమా వరల్డ్ వైడ్ 400 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి తీరాలని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఎస్ జె సూర్య విలన్ గా నటించారు అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించగా రేపు జనవరి 10న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కి వస్తుంది.