టాలీవుడ్ క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి లీడ్ రోల్‌లో నటించిన రీసెంట్ మూవీ ‘గాంధీ తాత చెట్టు’ ఇటీవల మంచి బజ్‌తో రిలీజ్ అయ్యింది. జనవరి 24న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్సిడ్ రెస్పాన్స్ లభించింది. పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాను ప్రమోట్ కూడా చేశారు. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.
అయితే, ఇప్పుడు ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం నేటి(మార్చి 21) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. పద్మావతి మల్లాది డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఓ చక్కటి మెసేజ్‌ను కలిగి ఉండటంతో థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో సుకృతి వేణి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురామ్, భాను ప్రకాశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.