‘గాండీవధారి అర్జున’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్, టైం లాక్

‘గాండీవధారి అర్జున’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్, టైం లాక్

Published on Jul 28, 2023 10:00 PM IST


యువ నటుడు వరుణ్ తేజ్ హీరోగా ఏజెంట్ భామ సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గాండీవధారి అర్జున. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి మిక్కీ జె మేయర్ స్వరపరిచిన నీ జతై అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని రేపు అనగా జులై 29న సాయంత్రం 4 గం. 5 ని. లకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తెలిపారు. జంగ్లీ మ్యూజిక్ సౌత్ వారి ద్వారా ఈ మూవీ సాంగ్స్ రిలీజ్ కానున్నాయి. కాగా ఈ ప్రతిష్టాత్మక సినిమాని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 25న గ్రాండ్ గా థియేట్ర్స్ లోకి తీసుకురానున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు