‘భీమ్లా నాయ‌క్’ సినిమాలో ఓ స్పెషల్ ఉందన్న గణేశ్ మాస్టర్..!

‘భీమ్లా నాయ‌క్’ సినిమాలో ఓ స్పెషల్ ఉందన్న గణేశ్ మాస్టర్..!

Published on Feb 23, 2022 8:59 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నేడు ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఎంతో అట్టహాసంగా కొనసాగుతుంది. అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్న భీమ్లా నాయ‌క్ టైటిల్ ట్రాక్‌కి కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ స్టేజ్‌పై స్టెప్పులు వేసి అదరగొట్టాడు.

అనంతరం గ‌ణేశ్ మాస్ట‌ర్ మాట్లాడుతూ న‌న్ను ఎంతగానో ప్రోత్స‌హిస్తున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ సార్‌కు, అలాగే ఈ సినిమాకు అవ‌కాశం ఇచ్చిన త్రివిక్ర‌మ్‌, సాగ‌ర్ కే చంద్ర‌, నాగ‌వంశీ గార్లకు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నానని అన్నారు. అయితే ఈ సినిమాకి థ‌మ‌న్ చాలా కొత్త‌గా మ్యూజిక్ ఇచ్చాడని, మేం కూడా కొత్త‌గా చేశామని అన్నారు. ఇందులో ప‌వ‌న్ కొత్త‌గా క‌నిపిస్తారని, కొత్త స్టెప్పులేస్తారని చెప్పారు. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ ఉందని, అది థియేటర్‌లోనే చూసి ఎంజాయ్ చేయాల‌ని చెప్పాడు. అయితే గణేశ్ మాస్టర్ చెప్పిన స్పెషల్ ఏమై ఉంటుందా అని ఇప్పుడు పవన్ అభిమానులు ఆలోచిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు