నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతోన్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”

నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతోన్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”

Published on Jun 17, 2024 8:04 PM IST

టాలీవుడ్ నటుడు, మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి మరియు అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన విలేజ్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మే 31, 2024 న ధియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. రిలీజ్ కి ముందు మంచి హైప్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లను రాబట్టలేదు. అయితే ఇటీవల ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ లోకి డిజిటల్ ప్రీమియర్ గా అడుగు పెట్టింది.

ఈ చిత్రం ప్రస్తుతం టాప్ 2 లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో సాయి కుమార్, గోపరాజు రమణ, అయేషా ఖాన్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు