కొత్త పోస్టర్ విడుదల చెయ్యనున్న గాయత్రి యూనిట్ !

నటుడు మోహన్ బాబు ప్రధానపాత్రలో తెరకేక్కబోతున్న సినిమా ‘గాయత్రి’. వైవిధ్యమైన కథనంతో తెరకేక్కబోతున్న ఈ సినిమాను మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రచయిత డైమండ్ రత్నబాబు కథ, మాటలు అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు రెండు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సినిమా విడుదల తరువాత మోహన్ బాబు ఈ సినిమాలో చేసిన నట విశ్వరూపం గురించి ప్రతివక్కరు మాట్లాడుకోనేలా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. రేపు ఈ సినిమకు సంభందించిన కొత్త పోస్టర్ విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్.

Exit mobile version