బుల్లితెరపై ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’కి సాలిడ్ రెస్పాన్స్

బుల్లితెరపై ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’కి సాలిడ్ రెస్పాన్స్

Published on Aug 1, 2024 4:00 PM IST

ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన హాార్రర్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. గతంలో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వచ్చింది. అయితే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. కాగా, ఇటీవల ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రముఖ టీవీ ఛానల్ ‘స్టార్ మా’లో ప్రసారం అయ్యింది.

బుల్లితెరపై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఏకంగా 7.39 టీఆర్‌పీ రేటింగ్‌ను రాబట్టింది. థియేటర్లలో అంతగా ఆకట్టుకోని ఈ చిత్రానికి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం గొప్ప విషయమని చెప్పాలి. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ హార్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు