సమీక్ష : గీతాంజలి మళ్ళీ వచ్చింది – రొటీన్ హారర్ కామెడీ డ్రామా !

సమీక్ష : గీతాంజలి మళ్ళీ వచ్చింది – రొటీన్ హారర్ కామెడీ డ్రామా !

Published on Apr 12, 2024 3:04 AM IST
Geethanjali Malli Vachindi Movie Review in Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, అంజలి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవి శంకర్, సత్య తదితరులు.

దర్శకుడు: శివ తూర్లపాటి

నిర్మాత: కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం వివి సినిమాస్

సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ

ఎడిటింగ్: చోటా కే ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

అంజలి ప్రధాన పాత్రలో, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య కీలక పాత్రల్లో.. శివ తుర్లపాటి దర్శకత్వం లో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

శ్రీను (శ్రీనివాస రెడ్డి) సినిమా పరిశ్రమలో దర్శకుడిగా ఛాన్స్ కోసం తన టీమ్ తో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తమ ఆర్థిక కష్టాల నుంచి బయట పడేందుకు తన ఫ్రెండ్ సత్య (అయాన్)ని హీరోని చేస్తానని అబద్ధాలు చెబుతూ అతని దగ్గర డబ్బులు తీసుకుంటూ లైఫ్ నెట్టుకొస్తుంటారు శ్రీను అండ్ అతని టీమ్. ఐతే, ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వారికి సత్య హీరోగా ఓ సినిమా చేసే అవకాశం వస్తోంది. ఊటీలో ఓ కాపీ రిసార్ట్ నడుపుతున్న అంజలి (అంజలి) శ్రీను సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంటుంది. కాకపోతే, నిర్మాత విష్ణు ఊటీలోని దెయ్యాల కోట సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేయాలని షరతు పెడతాడు. ఇంతకీ, ఆ సంగీత్ మహల్ గతం ఏమిటి ?, ఆ మహల్ లోని దెయ్యాల కథ ఏమిటి ?, అసలు విష్ణు ఎవరు ?, అతను ఎందుకు శ్రీను బ్యాచ్ ను మరియు అంజలిని టార్గెట్ చేశాడు ?, తన చెల్లి అంజలిని సేవ్ చేయడానికి గీతాంజలి (అంజలి) ఏం చేసింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

మొత్తానికి భయంతో కూడుకున్న కామెడీనే సక్సెస్ ఫార్మాట్ గా తీసుకోని గీతాంజలికి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. ఈ జోనర్ లో సినిమా అంటేనే.. కామెడీ, భయం లాంటి అంశాలతో అల్లుకొని రాసుకున్న సీన్స్ తోనే ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా కూడా అలాగే సాగింది. ముఖ్యంగా కోన వెంకట్ టీమ్ ఇటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అటు భయాన్ని, ఎమోషన్ని కూడా బాగానే పండించారు. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ కమెడియన్ సత్య కామెడీనే హైలైట్ గా నిలిచింది.

హీరోయిన్ అంజలి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా అంజలి కొన్ని హర్రర్ సన్నివేశాల్లో తన నటనతో మెప్పించింది. ‌మరో ప్రధాన పాత్రలో నటించిన శ్రీనివాస్ రెడ్డి కూడా బాగానే మెప్పించాడు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన సత్యం రాజేష్, షకలక శంకర్, రవి శంకర్, రావు రమేష్ తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే తల్లి దెయ్యం పాత్రలో నటించిన ప్రియ కూడా బాగా నటించింది.

ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. దర్శకుడిగా శివ తూర్లపాటి హర్రర్ అండ్ కామెడీ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు శివ తూర్లపాటి తెరకెక్కించిన కొన్ని హర్రర్ అండ్ కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ప్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. ఇకపోతే కథనం మరియు నేరేషన్ లో ఇంతకు ముందు వచ్చిన గీతాంజలి లో ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ నే ఈ రెండో పార్ట్ లో కూడా ఫాలో అయ్యారు. దాంతో కొన్ని సీన్స్ ఇంతకు ముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది.

పైగా సెకండాఫ్ మొదలైన 10 నిమిషాల తర్వాత గాని ఆడియన్ అసలు కథలోకి వెళ్ళడు. అలాగే ఫస్ట్ హాఫ్ లోని కామెడీ కూడా బాగా విసిగించింది. అసలు అనవసరమైన వర్కౌట్ కానీ సీన్స్ ను ఫస్ట్ హాఫ్ లో తీసేసి ఉంటే.. సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. ఓవరాల్ గా హర్రర్ సీన్స్, సెకండ్ హాఫ్ లో కామెడీ ఎలిమెంట్స్ బాగున్నా.. మిగతా కంటెంట్ అంతా రెగ్యులర్ గానే సాగింది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది రచయిత కోన వెంకట్ పనితనం గురించే.. కొన్ని విసిగించే సీన్స్ ను కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయ్యింది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్ ను కట్ చేసిన విధానం బాగుంది. కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం వివి సినిమాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ వచ్చిన ఈ హారర్ రివెంజ్ డ్రామా.. కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు కొన్ని హారర్ ఎలిమెంట్స్ తో కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది. సత్య – సునీల్ తమ కామెడీ టైమింగ్ తో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశారు. కాకపోతే రొటీన్ హర్రర్ ఎలిమెంట్స్ మరియు ఇంట్రెస్ట్ గా సాగని ఫస్ట్ హాఫ్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఎక్కువ అంచనాలు లేకుండా వెళ్తే.. ఈ సినిమాలోని కొన్ని కామెడీ ఎలిమెంట్స్ బాగానే ఎంటర్ టైన్ చేస్తాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు