ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘జెంటిల్ మెన్ – 2’

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘జెంటిల్ మెన్ – 2’

Published on Oct 30, 2023 11:17 PM IST


అర్జున్ సర్జా, దర్శక దిగ్గజం శంకర్ ల క్రేజీ కాంబినేషన్లో కొన్నేళ్ల క్రితం రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ జెంటిల్ మేన్ మూవీ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ కూడా తెలుగులో కూడా అది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. కంటెంట్ పరంగానే కాక మ్యూజికల్ గా కూడా ఆ మూవీ పెద్ద సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ మూవీకి సీక్వెల్ గా జెంటిల్ మేన్ 2 ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయి ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఏ గోకుల్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్ లో చేతన్, నయనతార చక్రవర్తి మరియు ప్రియా లాల్ కీలక పాత్రలు చేస్తున్నారు.

ఇక ఇటీవల చెన్నైలో ప్రారంభం అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ లో పలువురు ముఖ్య పాత్రధారుల పై కీలక సన్నివేశాలు చిత్రీకరించింది యూనిట్. ఇక ఈ షెడ్యూల్ మొత్తం పూర్తి అయిందని, అలానే నవంబర్ 3వ వారంలో హైదరాబాద్, చెన్నై, పాండిచ్చేరి లలో సెకండ్ షెడ్యూల్ ని ప్రారంభించి దాని అనంతరం మలేషియా, శ్రీలంక, దుబాయ్ లలో ఇతర షెడ్యూల్స్ ని జరుపునున్నారు మేకర్స్. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సీక్వెల్ ని కూడా జెంటిల్ మ్యాన్ నిర్మాత కుంజుమోన్ నిర్మిస్తుండడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ వరుసగా రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు