పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ చిత్రం “ఓజి” కూడా ఒకటి. మరి ఈ సినిమాపై ఉన్న అంచలనాలకి అయితే ఆకాశమే హద్దు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చిత్రంని పవన్ కళ్యాణ్ ఎంత వేగంగా కంప్లీట్ చేసారో అంతో గ్యాప్ కూడా ఇచ్చేసారు.
దీనితో తన డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది కూడా మంచి సస్పెన్స్ గా మారగా ఇపుడు కొన్ని క్రేజీ రూమర్స్ ఈ చిత్రంపై వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ లోనే దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
గత ఏడాది సెప్టెంబర్ నెలలో మిస్ అయ్యింది కానీ మళ్ళీ ఇదే ఏడాదిలో అదే నెలలో రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనికంటే ముందు బ్లాస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. దీనితో ఓజి టీజర్ ని మేకర్స్ ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.