ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న‌ ‘రాజు యాదవ్’

ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న‌ ‘రాజు యాదవ్’

Published on Jul 18, 2024 5:40 PM IST

గెట‌ప్ శ్రీ‌ను హీరోగా న‌టించిన రీసెంట్ మూవీ ‘రాజు యాద‌వ్’ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డంలో మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. మే 24న థియేట‌ర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు కూడా రాబట్టింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను మేక‌ర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని జూలై 24 నుంచి ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో రాజు యాద‌వ్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు వారు ప్ర‌కటించారు. ద‌ర్శ‌కుడు కృష్ణ‌మాచారి తెర‌కెక్కించిన ఈ సినిమాలో గెట‌ప్ శ్రీ‌ను పూర్తి మాస్ అవ‌తారంలో క‌నిపించాడు.

సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను ప్ర‌శాంత్ రెడ్డి ప్రొడ్యూస్ చేయ‌గా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో అంకిత కిర‌ణ్ హీరోయిన్ గా న‌టించ‌గా ఆనంద చ‌క్ర‌పాణి, రాకెట్ రాఘ‌వ‌, మిర్చి హేమంత్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు