మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లో స్వీటీ అనుష్క కూడా ఒకరు. మరి అనుష్క కొంచెం గ్యాప్ తీసుకుంటున్నప్పటికీ సాలిడ్ సబ్జెక్టు లతోనే వస్తుంది. మరి అలా లేటెస్ట్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న అవైటెడ్ సినిమా “ఘాటీ” కూడా ఒకటి.
మరి షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇపుడు అవైటెడ్ ఫస్ట్ లుక్ ని తన బర్త్ డే కానుకగా రిలీజ్ చేసేసారు. అయితే ఈ ఫస్ట్ లుక్ మాత్రం అనుష్కపై ఈ రేంజ్ లో ఉంటుంది అని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఒక థ్రిల్లింగ్ లుక్ లో అయితే అనుష్క ఇందులో కనిపిస్తుంది.
చేతిలో హుక్కా పట్టుకొని ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఆమె కళ్ళని చూడొచ్చు. మొత్తానికి అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే మేకర్స్ హిట్ కొట్టారని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ఈ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి ఫస్ట్ గ్లింప్స్ ని వదలబోతున్నారు. మరి అదెలా ఉంటుందో చూడాలి.
VICTIM. CRIMINAL. LEGEND.
The Queen will now rule the #GHAATI ❤????
Wishing 'The Queen' #AnushkaShetty a very Happy Birthday ✨#GhaatiGlimpse Video today at 4.05 PM ✨
In Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.#HappyBirthdayAnushkaShetty@DirKrish @UV_Creations… pic.twitter.com/jgZEBPU5gx
— UV Creations (@UV_Creations) November 7, 2024