గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. ఇపుడు ఈ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉండగా చరణ్ కూడా పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ లో పాల్గొనడం జరిగింది. మరి ఇలా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో నట సింహం బాలయ్య హోస్ట్ గా చేస్తున్న సూపర్ హిట్ టాక్ షో అన్ స్టాప్పబుల్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
మరి ఈ ఎపిసోడ్ రేపు జనవరి 8న ప్రసారం కానుండగా ఇందులో చాలా ఆసక్తికర ప్రశ్నలకి చరణ్ సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఇలా చరణ్ బెస్ట్ నటి ఎవరు అనే ప్రస్తావనలో కియారా అద్వానీ, ఆలియా భట్ అలాగే సమంతల పేర్లు చెబితే వారిలో బెస్ట్ నటిగా సమంతని మాత్రమే గ్లోబల్ స్టార్ పిక్ చేసుకున్నాడట. మరి ఈ ఇద్దరు ఆల్రెడీ “రంగస్థలం”లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరి రేపు ప్రసారం కానున్న ఈ అవైటెడ్ ఎపిసోడ్ ఇంకెంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో చూడాలి.