లేటెస్ట్: అదరగొట్టిన ‘గాడ్ ఫాథర్’ ‘టక్కర్ మార్’ సాంగ్ ప్రోమో

లేటెస్ట్: అదరగొట్టిన ‘గాడ్ ఫాథర్’ ‘టక్కర్ మార్’ సాంగ్ ప్రోమో

Published on Sep 13, 2022 6:23 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా సందర్భంగా అక్టోబర్ 5 న రిలీజ్ కానున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ , ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి హైప్ క్రియేట్ చేయగా నేడు కొద్దిసేపటి క్రితం మూవీ నుండి టక్కర్ మార్ అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ప్రోమో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్.

థమన్ అందించిన మంచి మాస్ బీట్ తో సాగె ఈ సాంగ్ ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ కూడా సిగ్నేచర్ స్టెప్ తో ఆకట్టుకున్నారు. ఇక ప్రోమో ని బట్టి చూస్తే ఫుల్ సాంగ్ రిలీజ్ తరువాత మరింతగా అలరిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో కి మంచి వ్యూస్ లభిస్తున్నాయి. కాగా ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో ని సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఇక ఈ సాంగ్ రేపు థియేటర్స్ లో కూడా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని బాగా థ్రిల్ చేయడంతో పాటు మంచి రెస్పాన్స్ అందుకుంటుందని అంటోంది యూనిట్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు