కోటి వ్యూస్ కి దగ్గరలో “గాడ్ ఫాథర్” టీజర్..!

కోటి వ్యూస్ కి దగ్గరలో “గాడ్ ఫాథర్” టీజర్..!

Published on Aug 23, 2022 7:07 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు మోహన్ రాజా తో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ బర్త్ డే కానుకగా మేకర్స్ రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ టీజర్ అయితే సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

తెలుగులో ఈ టీజర్ లేటెస్ట్ 9.8 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి 1 కోటి వ్యూస్ కి దగ్గరలో ఉంది. మరి హిందీలో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ టీజర్ తో అయితే సినిమాపై మరిన్ని స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి అయితే థమన్ సంగీతం అందించాడు. అలాగే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించగా తెలుగు మరియు హింది భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు