సమీక్ష : గాడ్ – నిరుత్సాహ పరిచే సైకో క్రైమ్ డ్రామా !

సమీక్ష : గాడ్ – నిరుత్సాహ పరిచే సైకో క్రైమ్ డ్రామా !

Published on Oct 14, 2023 3:05 AM IST
God Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 13, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: జయం రవి, నయనతార, నరేన్, వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి తదితరులు

దర్శకుడు : ఐ అహ్మద్

నిర్మాతలు: సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్

సంగీతం: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం

ఎడిటర్: జెవి మణికంద బాలాజీ

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

జయం రవి హీరోగా నటించిన ఇరైవన్ అనే తమిళ సినిమా గత నెల 28వ తేదీన తమిళంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని తెలుగులో గాడ్ పేరుతో ఈ రోజు రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

అర్జున్ (జయం రవి) అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. అతనికి భయమే ఉండదు. నేరాలు చేసే వారి ఆట కట్టించడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తుంటాడు. అర్జున్ కి, ఏసీపీ ఆండ్రూ (నరేన్ రామ్) మంచి స్నేహితుడు. ఐతే, అర్జున్ ఎన్కౌంటర్లు చేయడం ఆండ్రూకి ఇష్టం ఉండదు. పైగా అర్జున్ చేసే తప్పుల్ని ఆండ్రూ కవర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఓ సైకో కిల్లర్, ఆండ్రూని చంపేస్తాడు. తన స్నేహితుడు చావుతో ఇక తాను ఉద్యోగంలో కొనసాగలేనని చెప్పి రిజైన్ చేస్తాడు అర్జున్. ఈ మధ్యలో ఆండ్రు సోదరి ప్రియ (నయనతార), అర్జున్ తో ప్రేమలో పడుతుంది. మరోవైపు సైకో కిల్లర్ బ్రహ్మ జైలు నుంచి తప్పించుకుని అర్జున్ సన్నిహితులైన అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసి చంపేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అర్జున్ బ్రాహ్మను మరోసారి పట్టుకున్నాడా ? లేదా ?, అసలు ఈ బ్రహ్మ ఎవరు ?, చివరికి బ్రహ్మ ఆగడాలకు అర్జున్ ఎలా అడ్డుకట్ట వేశాడు? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ సీరియస్ సైకో కిల్లర్ చుట్టూ ఈ సినిమా సప్సెన్స్ తో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ తో సాగింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ పర్వాలేదు. ప్రధానంగా సినిమాలో సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను హత్యలు చేస్తుండటం, ఆ హత్యలకు సంబంధించిన ట్రాక్.. అలాగే హీరో పాత్రతో ముడి పడిన మిగిలిన ప్రధాన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్ వంటి అంశాలు సినిమాలో ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

ఇక అర్జున్ అనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పాత్రలో జయం రవి ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ సినిమాలో సీరియస్ నెస్ తో ఒక ఇంట్రస్ట్ ను జయం రవి తన ఎక్స్ ప్రెషన్స్ తో మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. నరేన్, వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు ఐ.అహ్మద్ రాసుకున్న కాన్సెప్ట్ మరియు కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ సీరియస్ గా సాగడం.. దానికి తోడూ కొన్ని సన్నివేశాల్లో ప్లో కూడా మిస్ అవ్వడంతో సినిమా బాగా బోర్ కొడుతోంది. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది.

దీనికితోడు సినిమా నిండా సిల్లీ మెలో క్రైమ్ డ్రామాను మోతాదుకు మించి పెట్టి విసిగించారు. పైగా సినిమాలో చాలా సన్నివేశాలు పూర్తి సినిమాటిక్ గా ఇంట్రెస్ట్ కలిగించకుండా సాగుతాయి. అయినా, వాస్తవానికి పూర్తి దూరంగా సాగే ప్లేలో ఇక ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎలా వస్తాయి ?. కథనంలోని ప్రతి సన్నివేశం స్లోగా సాగుతూ అసలు కన్వీన్స్ కానీ విధంగా ముగుస్తోంది.

దానికి తోడు ట్రీట్మెంట్ కూడా బోరింగ్ ప్లేతో సాగుతూ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ను చంపేసింది. అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కెమెరామెన్ గా చేసిన హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు అహ్మద్ మంచి కథాంశం రాసుకున్నా.. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అండ్ ప్లే ను రాసుకోలేకపోయాడు.

 

తీర్పు :

 

గాడ్ అంటూ వచ్చిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా ఆకట్టుకునే విధంగా సాగలేదు. మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ, కొన్ని యాక్షన్ సీన్స్, జయం రవి – నయనతార నటన బాగుంది. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం నిరుత్సాహ పరుస్తోంది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు