‘గోదారి గట్టు’ సాంగ్‌కి ప్రేక్షకుల పట్టం.. ఏకంగా 25 మిలియన్ వ్యూస్!

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ‘గోదారి గట్టు’ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. చాలా రోజుల తర్వాత రమణ గోగుల ఈ పాటను పాడటంతో ప్రేక్షకుల్లో ముందునుంచీ ఈ పాటపై మంచి ఆసక్తి నెలకొంది.

అయితే, చక్కటి లిరిక్స్.. మెలోడీగా సాగే మ్యూజిక్.. రమణ గోగుల వాయిస్ ఫ్రెష్ ఫ్లేవర్ కలగలిసి ఈ పాటను ఇన్‌స్టంట్ హిట్‌గా చేశాయి. మధుప్రియ కూడా చాలా చక్కగా పాడటం.. ఈ పాటకు వెంకటేష్‌తో కలిసి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వేసిన స్టెప్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి. దీంతో ఈ పాటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ‘గోదారి గట్టు’ సాంగ్ రిలీజ్ అయినదగ్గర్నుండి ఇప్పటివరకు ఈ పాట వైబ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా ఈ పాట ఏకంగా 25 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను దక్కించుకున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేగాక ఈ పాటకు అధిక సంఖ్యలో రీల్స్, షార్ట్స్ చేస్తున్నట్లు సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రజెంట్ చేస్తుండగా శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి రోజున గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Exit mobile version