సీడెడ్ లో మొదటి రోజు “గాడ్ ఫాథర్” కి డీసెంట్ ఓపెనింగ్స్!

సీడెడ్ లో మొదటి రోజు “గాడ్ ఫాథర్” కి డీసెంట్ ఓపెనింగ్స్!

Published on Oct 6, 2022 12:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ లాంటి ఎందరో స్టార్ నటులు నటించిన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాథర్”. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ మార్పులు చేర్పులు చేసి మరింత ఆసక్తిగా ఈ చిత్రాన్ని మలిచారు. ఇక ఈ చిత్రం అయితే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఈ పండగలో మంచి వసూళ్లు నమోదు అవుతూ వస్తున్నాయి.

మరి ముఖ్యమైన ఏరియాల్లో నైజాం లో యావరేజ్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు సీడెడ్ లో అయితే ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. మొదటి రోజు ఈ చిత్రం 3 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. మరి ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందించగా కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు