ఏపీ.. ఈ ఏరియాల్లో “గాడ్ ఫాథర్” వసూళ్లు ఎలా ఉన్నాయంటే.!

ఏపీ.. ఈ ఏరియాల్లో “గాడ్ ఫాథర్” వసూళ్లు ఎలా ఉన్నాయంటే.!

Published on Oct 6, 2022 1:00 PM IST

ఈ ఏడాది టాలీవుడ్ లో లేటెస్ట్ గా వచ్చిన సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ అదిరే గెస్ట్ రోల్ లో చేసిన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. మరి మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అయితే పలు ఏరియాల్లో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. అలా చేసిన వాటిలో ఇప్పుడు గుంటూరు, నెల్లూరు మరియు ఈస్ట్ గోదావరి వసూళ్లు తెలుస్తున్నాయి.

గుంటూరులో ఈ చిత్రం అయితే 1.25 కోట్ల షేర్ ని రాబట్టగా నెల్లూరులో 57 లక్షలు అలాగే ఈస్ట్ గోదావరిలో 1.6 కోట్ల షేర్ ని ఈ చిత్రం రాబట్టింది. దీనితో అయితే ఈ చోట్ల గాడ్ ఫాథర్ మంచి నంబర్స్ నే నమోదు చేసింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నయనతార, సునీల్, సత్యదేవ్ తదితరులు నటించగా థమన్ సంగీతం అందించారు. అలాగే పూరి జగన్నాథ్ ఓ కీలక పాత్రలో కనిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు