‘గాడ్ ఫాదర్’ లేటెస్ట్ యుఎస్ఏ కలెక్షన్స్ డిటెయిల్స్

‘గాడ్ ఫాదర్’ లేటెస్ట్ యుఎస్ఏ కలెక్షన్స్ డిటెయిల్స్

Published on Oct 9, 2022 12:09 AM IST


మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా ల తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ సక్సెస్ఫుల్ మూవీ గాడ్ ఫాదర్. ఈ మూవీని మలయాళ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కగా నయనతార, సత్యదేవ్, మురళి శర్మ, బ్రహ్మాజీ, సముద్రఖని, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు చేసారు. థమన్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్స్ తో కొనసాగుతోంది.

అలానే అటు యుఎస్ఏ లో కూడా ప్రస్తుతం మంచి కలెక్షన్స్ రాబడుతున్న గాడ్ ఫాదర్ ఇప్పటికే $750K డాలర్లు మార్క్ ని దాటేసింది. దీనిని బట్టి ఈ వీకెండ్ పూర్తి అయ్యేలోపు గాడ్ ఫాదర్ ఓవరాల్ గా 1 మిలియన్ డాలర్లు అందుకునే అవకాశం కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. కాగా ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు