డే 1 తెలుగు స్టేట్స్ లో “గాడ్ ఫాథర్” వసూళ్ల వివరాలు.!

డే 1 తెలుగు స్టేట్స్ లో “గాడ్ ఫాథర్” వసూళ్ల వివరాలు.!

Published on Oct 6, 2022 2:00 PM IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మరో చిత్రం “గాడ్ ఫాథర్”. ఈ ఏడాది మెగాస్టార్ నుంచి రెండో రిలీజ్ ఇది కాగా ఈ చిత్రానికి కూడా మంచి బజ్ తో ఓపెనింగ్స్ అందుకోవడమే కాకుండా సాలిడ్ పాజిటివ్ టాక్ కూడా నమోదు అయ్యింది. ఇక దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం అయితే తెలుగు రాష్ట్రాల్లో పలు ఏరియాల్లో అయితే మంచి ఓపెనింగ్స్ నే అందుకోగా..

ఓవరాల్ గా అయితే యావరేజ్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఏపీలో అయితే గాడ్ ఫాథర్ 10 కోట్ల మేర షేర్ రాబట్టగా నైజాం లో 3 కోట్లు అందుకుంది. దీనితో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 13 కోట్ల షేర్ ని అందుకుంది. అయితే ఇది గత మెగాస్టార్ చిత్రాలతో పోలిస్తే యావరేజ్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక ఫైనల్ గా ఎలాంటి వసూళ్లు ఈ చిత్రం అయితే అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు