‘గుడ్ బ్యాడ్ అగ్లీ’.. అజిత్ ఫ్యాన్స్ కి అనిరుద్ తో మాస్ ట్రీట్!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాపై హైప్ మరింత ఎక్కువ అవుతూ వెళుతుంది అని చెప్పాలి. జీవి ప్రకాష్ ఇచ్చిన ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ మంచి హిట్ అయ్యింది.

ఇక ఈ తర్వాత రెండో సాంగ్ గా గాడ్ బ్లెస్స్ యూ మామే అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక దీనిని కూడా పక్కా మాస్ ట్రీట్ తో జీవి ప్లాన్ చేసాడని చెప్పాలి. పైగా సెన్సేషనల్ మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ తో ఈ సాంగ్ ని పాడించగా అనిరుద్ తన ఎనర్జీతో మరింత ఇంపాక్ట్ ఈ సాంగ్ కి అందించాడు అని చెప్పవచ్చు. ఇలా ఫ్యాన్స్ కి మాత్రం మంచి ఉగాది ట్రీట్ ని మేకర్స్ అందించారు అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఈ రానున్న ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version