థలా స్వాగ్ తో అదిరిపోయిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” సెకండ్ లుక్ పోస్టర్

థలా స్వాగ్ తో అదిరిపోయిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” సెకండ్ లుక్ పోస్టర్

Published on Jun 27, 2024 7:02 PM IST

కోలీవుడ్ లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా ఇప్పుడు రెండు సినిమాలు చేస్తుండగా ఈ చిత్రాల్లో తన అభిమాని, టాలెంటెడ్ దర్శకుడు అదిక్ రవి చంద్రన్ కాంబినేషన్ లో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “గుడ్ బ్యాడ్ అగ్లీ” కూడా ఒకటి. మరి ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ కి సాలిడ్ రెస్పాన్స్ రాగా మేకర్స్ లేటెస్ట్ గా సెకండ్ లుక్ ని కూడా బయటకి వదిలారు.

మరి ఈ లుక్ కూడా ఫస్ట్ లుక్ మాదిరిగానే క్రేజీ లెవెల్లో ఉందని చెప్పాలి. మెయిన్ గా ఇందులో అజిత్ తన స్వాగ్ తో అదరగొట్టేసారు. దీనితో ఈ పోస్టర్ ఇప్పుడు అభిమానులకి మంచి ఫీస్ట్ ని అందిస్తుంది. ఇలా ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మన టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు