మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ కి భారీ వ్యూస్ తో పాటుగా మంచి రెస్పాన్స్ రావడం తో పరిస్థితులు మారిపోయాయి.
ఈ చిత్రం రేపు థియేటర్ల లో భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. మరియు ఇప్పుడు ఈ చిత్రంలో రవితేజ ఒక రాజకీయ పార్టీకి వార్నింగ్ ఇస్తున్న చిన్న క్లిప్ వైరల్‌గా మారింది. రవితేజ ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ని చెబుతున్న దృశ్యం వైరల్‌గా మారింది. ఇది ఇప్పుడు సినిమాకు కొత్త బజ్ ఇచ్చింది. వీడియో సైతం సినిమా పై మరింత ఆసక్తి ను పెంచేసింది. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.