‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా నటించిన సినిమా ‘గుడ్ లక్ సఖి’. అయితే, తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ‘మన దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయబోతున్నాను’ అంటూ జగపతిబాబు డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ చాలా బాగుంది. బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ‘కీర్తి సురేష్’ ప్రయాణాన్ని తక్కువ షాట్స్ లో చాలా బాగా ఎలివేట్ చేశారు. ట్రైలర్ లో ఎమోషన్ కూడా బాగా హైలైట్ అయింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించి అలరించారు.
ఇక ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతుంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కింది ఈ చిత్రం.
ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి