కల్కి 2′ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

కల్కి 2′ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

Published on Mar 16, 2025 7:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. అటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఐతే, దీనికి కొనసాగింపుగా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. ఇక ‘కల్కి 2’ సినిమా విశేషాలు తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ‘కల్కి 2’ అప్ డేట్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఐతే, అమితాబ్ బచ్చన్ ఈ క్రేజీ సీక్వెల్ పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానన్నారు.

కాగా ఈ క్రేజీ సీక్వెల్ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె.. పార్ట్‌ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనుంది. ఆ మధ్య నిర్మాతలు స్వప్న- ప్రియాంక మాట్లాడుతూ.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన షూట్‌ను కొంతమేర తీయడం జరిగింది. పార్ట్‌ 2కు సంబంధించి 35 శాతం షూట్‌ జరిగింది’ అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు