పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…జల్సా స్పెషల్ షోలకు సర్వం సిద్ధం!

Published on Aug 13, 2022 12:18 am IST

పోకిరి స్పెషల్ షోల అద్బుత విజయం తర్వాత ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల వంతు వచ్చింది. నటుడి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న జల్సాను భారీగా రీ రిలీజ్ చేయడానికి అభిమానులు ఇప్పటికే ప్లాన్‌లో ఉన్నారని మేము ఇంతకుముందు నివేదించాము. అయితే ఈ సినిమా 4కె రీమాస్టరింగ్ పనుల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.

అయితే, ఇప్పుడు అభిమానులకు శుభవార్త ఏమిటంటే, అన్ని టెక్నికల్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి మరియు సినిమా స్పెషల్ షోలతో అభిమానులను అలరించడానికి సిద్దం అయ్యింది. ప్రకటన రాగానే అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. షోలు మరియు థియేటర్ల సంఖ్యకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా చిత్రంలో ఇలియానా డిక్రూజ్ కథానాయిక గా నటించింది. కమలినీ ముఖర్జీ, పార్వతి మెల్టన్, ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, శివాజీ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ను గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :