యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై ఎంతో భారీ వ్యయంతో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది.
గోదావరి జిల్లాలోని గ్రామీణ నేపథ్యంలో ఇసుక మాఫియా కథాంశంతో సాగే మూవీగా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా ఇటీవల ఈ మూవీ నుండి సుట్టంలా సూసి అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ విడుదల చేసారు మేకర్స్. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఈ సాంగ్ ని శ్రీహర్ష ఈమని రచించగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు. యువతని ఎంతో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ యూట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ తో మంచి ఆదరణతో కొనసాగుతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి డిసెంబర్ 8న ఆడియన్స్ ముందుకి రానుంది.