కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, రుద్రమదేవి, పటాస్, రేసుగుర్రం చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించిన విక్రమ్ లగడపాటి, టీనేజ్ హీరోగా గోలిసోడా చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ఎవడూ తక్కువ కాదు పేరుతో అనువాదమై, ఈ కుర్రాడు అల్లాటప్పా కుర్రాడు కాదు, తనొక స్టార్ మెటీరియల్ అని నిరూపించింది. అల్లు అర్జున్ టైటిల్ రోల్ ప్లే చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో విక్రమ్ పోషించిన అన్వర్ అనే ముస్లిం కుర్రాడి పాత్ర నటుడిగా అతని ప్రతిభకు అద్దం పట్టింది. దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ చిత్రంలో రౌడీ కుర్రాళ్లలో ఒకడిగానూ నటించి మెప్పించాడు విక్రమ్.
తాజాగా ఈ లగడపాటి యువతేజం నటించిన వర్జిన్ స్టోరీ ఆహా వీడియోలో ప్రసారమవుతూ అసాధారణ స్పందన రాబడుతోంది. ప్రదీప్ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో విక్రమ్ సరసన సౌమిక నటించింది. యువతరం బ్రహ్మరథం పడుతున్న ఈ చిత్రాన్ని పెద్దలు సైతం బాగానే ఆస్వాదిస్తున్నారు. నంబర్ వన్ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో వర్జిన్ స్టోరీ కి వస్తున్న అద్భుత ఆదరణ గురించి మాట్లాడుతూ, ఇంత గ్రాండ్ రెస్పాన్స్ తాను అస్సలు ఊహించలేదని పేర్కొన్న విక్రమ్, ఈ క్రెడిట్ అంతా ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ చెందుతుందని అన్నాడు. తను హీరోగా నటించే తదుపరి చిత్రంతో పాటు, ఓ వెబ్ సిరీస్ కు సంబంధించిన వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని చెప్పిన విక్రమ్ లగడపాటి. వర్జిన్ స్టోరీ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.