ఇటీవలే ‘గౌతమ్ నంద’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరిచిన హీరో గోపీచంద్ తర్వాతి సినిమాను ప్రారంభించారు. ఆయన చేస్తున్న ఈ 25వ చిత్రం ఈరోజు ఉదయమే రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించనుండగా నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వం వహించనున్నాడు.
ప్రముఖ దర్శకుడు వినాయక్ మొదటి క్లాప్ కొట్టి సినిమాను ఆరంభించారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రం కూడా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఇందులోని ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.