ఆకట్టుకునే బీట్స్ తో గోపీచంద్ “విశ్వం” ఫస్ట్ సింగిల్ 

ఆకట్టుకునే బీట్స్ తో గోపీచంద్ “విశ్వం” ఫస్ట్ సింగిల్ 

Published on Sep 11, 2024 11:54 AM IST

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా గ్లామరస్ యంగ్ హీరోయిన్ కావ్య థాపర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “విశ్వం” కోసం అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ టీజర్ వీడియోతో డీసెంట్ బజ్ ని తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని అయితే రిలీజ్ చేశారు. మరి ఈ లిరికల్ వీడియో సాంగ్ వినేందుకు మాత్రమే కాకుండా చూసేందుకు కూడా ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. మోరోకాన్ మగువా అంటూ సాగే ఈ సాంగ్ కి చైతన్ భరద్వాజ్ తన మార్క్ స్టైలిష్ బీట్స్ ని అందించాడు అని చెప్పాలి.
అలాగే రాకేందు మౌళి ఇచ్చిన సాహిత్యం కూడా ట్రెండీగా ఉంది. ఇక సాంగ్ విజువల్ పరంగా కూడా బాగుంది. గోపీచంద్ మంచి స్టైలిష్ గా కనిపిస్తుండగా కావ్య థాపర్ కూడా బాగుంది. అలాగే ఈ సాంగ్ లో ఇద్దరి కాస్ట్యూమ్స్ కూడా వారి పర్సనాలిటీని సాంగ్ కి తగ్గట్టుగా కుదిరాయి. ఇలా ఈ సాంగ్ అయితే బాగానే ఉందని చెప్పాలి. మరి థియేటర్స్ లో ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 11 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు