‘విశ్వం’ హిందీ రైట్స్ కు అంత క్రేజా..?

‘విశ్వం’ హిందీ రైట్స్ కు అంత క్రేజా..?

Published on Jun 17, 2024 7:00 PM IST

మ్యాచో స్టార్ గోపీచంద్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను శ్రీను వైట్ల తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ మూవీపై సినీ వ‌ర్గాల్లో సైతం ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమాతో ఇటు హీరో, అటు డైరెక్ట‌ర్ ఖ‌చ్చితంగా సాలిడ్ హిట్ కొట్టాల‌ని చూస్తున్నారు.

కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ స‌ర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ‘విశ్వం’ మూవీ హిందీ రైట్స్ కు మంచి ఫ్యాన్సీ రేటు ల‌భించింద‌ట. ఈ సినిమాను హిందీ డిస్ట్రిబ్యూట‌ర్లు ఏకంగా రూ.13 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. గోపీచంద్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో, ఆయ‌న మార్కెట్ ప‌డిపోయి ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, ‘విశ్వం’ మూవీకి ఈ రేంజ్ లో బిజినెస్ జ‌రుగుతుండ‌టం చూసి అంతా స్ట‌న్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో కావ్య తాప‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా.. చేత‌న్ భ‌రద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టిజి.విశ్వ‌ప్ర‌సాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు