గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’. దసరా సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫన్ మూమెంట్స్ ను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ట్రైలర్ ను బట్టి సినిమాలో కామెడీకి కూడా బాగా స్కోప్ ఉన్నట్టు అర్థమవుతుంది. అటు యాక్షన్ కి కావాల్సిన సెటప్ ను కూడా శ్రీనువైట్ల బాగా డిజైన్ చేశాడు. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచింది.
ప్రస్తుతం ఈ ట్రైలర్ నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటుంది. కాగా విశ్వం చిత్రంలో కావ్య థాపర్, నరేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, ప్రవీణ్ మరియు వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.