టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో, కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ప్రియా భవానీ శంకర్ మరియు మాళవిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 8, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై హీరో గోపీచంద్ గట్టి నమ్మకం తో ఉన్నారు. సినిమా విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, గోపీచంద్ వివిధ ప్రింట్ మరియు వెబ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించాడు.
ఇవి త్వరలో విడుదల కానున్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి KGF మరియు సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్ల లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.