మంచి ధర పలికిన గోపిచంద్ సినిమా శాటిలైట్ రైట్స్ !


మ్యాచో మ్యాన్ గోపిచంద్ హీరోగా జె. భగవాన్, జె. పుల్లారావులు నిర్మిస్తున్న చిత్రం ‘గౌతమ్ నంద’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ గోపిచంద్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పబడుతోంది. ‘గౌతమ్ నంద’ అనే టైటిల్ ప్రకటనతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రం ఆ తర్వాత విడుదలైన టీజర్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. విజువల్స్ తో పాటు గోపిచంద్ కూడా ఎన్నడూ లేనంత స్టైలిష్ కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి.

దీంతో చిత్ర హక్కులకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ మంచి స్థాయిలో జరిగింది. అత్యధికంగా నైజాం ఏరియా హక్కులు రూ.6. 30 కోట్లకు అమ్ముడవగా శాటిలైట్ రైట్స్ కూడా రూ. 5. 50 కోట్లు పలికాయి. పేరు బయటకు రాలేదు కానీ లీడింగ్ టీవీ ఛానెల్ ఈ హక్కుల్ని దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో గోపిచంద్ సరసన హన్సిక, క్యాథరిన్ థ్రెసాలు హీరోయిన్లుగా కనువిందు చేయనున్నారు.

Exit mobile version