విడుదల తేదీ : డిసెంబర్ 16, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్, కియారా అద్వానీ, షాయాజీ షిండే, అమీ వా, రేణుక సహానీ తదితరులు
దర్శకుడు : శశాంక్ ఖైతాన్
నిర్మాతలు: హీరో యాష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్
సంగీత దర్శకులు: సచిన్ జిగర్, తనిష్క్ బాగ్చి, మీట్ బ్రదర్స్, బి పరాక్, రోచక్ కోహ్లీ
సినిమాటోగ్రఫీ: విదుషి తివారి
ఎడిటర్: చారు శ్రీ రాయ్
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఇటీవల గత కొంత కాలంగా పలు బడా సినిమాలు సైతం డైరెక్ట్ గా ఓటిటి ద్వారా ఆడియన్స్ ముందుకు వస్తున్నవి చూస్తున్నాం. ఆ విధంగా తాజాగా విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి ఫడ్నేకర్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గోవిందా నామ్ మేర మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీహాట్ స్టార్ లో నేడు రిలీజ్ అయింది. మరి ఈ మూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.
కథ :
గోవింద (విక్కీ కౌశల్) తన భార్య గౌరి (భూమి ఫడ్నేకర్) పెట్టే టార్చర్ ని భరిస్తూ అలానే తన కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. వృత్తి రీత్యా కొరియోగ్రాఫర్ అయిన గోవింద కు లేడీ కొరియోగ్రాఫర్ అయిన సుకుతో మరొక అఫైర్ ఉంటుంది. ఇక గోవింద వీలైనంత త్వరలో తన భార్య గౌరి నుండి విడాకులు తీసుకుని అనంతరం సుకుని పెళ్లి చేసుకుని కొత్తగా జీవితాన్ని గడపాలని ఆలోచన చేస్తుంటాడు. అయితే ఆ విధంగా తన నుండి విడాకులు కావాలి అంటే భరణం క్రింద తనకు రూ.2 కోట్లు కావాలని డిమాండ్ చేస్తుంది గౌరి. అయితే గోవింద తన సవతి తల్లి కుమారుడితో ఆస్థి వివాదాలతో పాటు అజిత్ ధర్కర్ (షాయాజీ షిండే) తో గొడవ పెట్టుకుని ఇరుక్కుంటాడు. అదే సమయంలో గోవింద భార్య గౌరి హఠాత్తుగా హత్యకు గురవడం, ఆ హత్యా నేరం గోవింద, సుకు ల పై పడడం జరుగుతుంది. కాగా వారిద్దరినీ గౌరి హత్యలో ఎవరు ఇరికించారు, అసలు గౌరిని ఎవరు చంపారు, అనంతరం కథ ఏవిధమైన మలుపులు తిరిగింది అనేది తెలుసుకోవాలి అంటే మూవీని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఇప్పటికే ఎన్నో సినిమాలతో నటుడిగా మంచి క్రేజ్ అందుకున్న విక్కీ కౌశల్ ఈ మూవీలోని గోవిందా పాత్రలో అద్భుతంగా నటించి తన నటనతో మరొక్కసారి ఆడియన్స్ ని అలరించారు. ముఖ్యంగా పలు సీన్స్ లో ఆయన కామెడీ టైమింగ్ అయితే సూపర్ గా ఉందనే చెప్పాలి. ఇప్పటివరకు అనేక సినిమాల్లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేసి ఆకట్టుకున్న యువ భామ కియారా అద్వానీ ఈ సినిమాలోని సుకు పాత్రలో మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర చేసారు. పలు సీన్స్ లో ఆమె నటన ఎంతో బాగుండడంతో పాటు సినిమాలోని కీలకమైన జైలు సన్నివేశశాల్లో ఆమె నటన మరింత అద్భుతంగా ఉందని చెప్పాలి. తప్పకుండా ఈ మూవీలోని సుకు పాత్ర నటిగా కియారాకి ఎంతో మంచి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా సినిమాలో చివరి అరగంట మాత్రం ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుంది. ఒక్కొక్కటిగా ట్విస్ట్ లు రివీల్ అవడం, ఆపైన ఒక స్టార్ నటుడు కీలక క్యామియో రోల్ లో కనిపించడం వెరసి సినిమాని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేస్తుంది.
మైనస్ పాయింట్స్ :
నిజానికి ఈ మూవీలో చివరి నలభై నిముషాలు ఎంతో ఆకట్టుకుని ఆడియన్స్ ని అలరించినప్పటికీ మధ్యలో చాలావరకు సీన్స్ ఒకింత ఇంట్రెస్టింగ్ గా సాగవు. ముఖ్యంగా చెప్పాలి అంటే క్రైమ్ థ్రిల్లర్ అనే కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు, దానికి తగ్గట్లు ఎంగేజింగ్ గా సాగె స్క్రీన్ ప్లే ని మాత్రం రాసుకోలేదు. కేవలం ఆడియన్స్ కి క్లైమాక్స్ మాత్రమే ఆకట్టుకుంటుంది తప్ప మిగతా సినిమాలో చాలా వరకు మైనస్ లు ఉన్నాయి అనే చెప్పాలి. సినిమా ప్రారంభ గంట సమయం మొత్తం కూడా ఎంతో సాదాసీదాగా సాగుతుంది, అలానే చాలా సీన్స్ ఆడియన్స్ బోరింగ్ గా ఉండడంతో పాటు అవి సినిమా రన్ టైం ని కూడా పెంచేసాయి అనే చెప్పాలి. ఇక మూవీలో ముఖ్య పాత్ర చేసిన చేసిన షాయాజీ షిండే మరియు అతడి కొడుకు మధ్యన వచ్చే సన్నివేశాలు పక్కాగా మరీ బోరింగ్ గా సాగడంతో పాటు గతంలో వచ్చిన అనేక సినిమాలను మనకి గుర్తు చేస్తాయి. సినిమాలో చాలావరకు కథనం, తరువాత ఏమి జరుగబోతోంది అనేది తెలిసిపోతుంది. అలానే కామెడీ కూడా శృతిమించింది, కొన్ని సన్నివేశాల్లో కావాలని కామెడీ సన్నివేశాలు ఇరికించారా అనిపించకమానదు.
సాంకేతికవర్గం :
సినిమాలో సంగీతం బాగుంది, అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంతో బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ అందించిన విదుషి తివారి కెమెరా పనితనం అద్భుతం అనే చెప్పాలి. సినిమాలో చాలా సీన్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే ఎడిటింగ్ విభాగం మాత్రం మరింత బాగా పనిచేసి ఉండాల్సింది, సినిమాలో కొన్ని అనవసర సన్నివేశాలు ఆడియన్స్ సహనానికి ఇబ్బంది పెట్టడంతో పాటు అవి రన్ టైం పరంగా కూడా ఇబ్బందికరంగా మారాయి. ఇక దర్శకుడు శశాంక్ ఖైతాన్ గురించి చెప్పాలి అంటే, మొత్తంగా అతడి వర్క్ కేవలం యావరేజ్ గా మాత్రమే అనిపిస్తుంది. కథ బాగున్నా కథనం మాత్రం అసలు అలరించాడు, ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు ఒకింత గందరగోళంగా ఉండడంతో పాటు అసలు అతడు ఆడియన్స్ కి ఏమి చెప్పదల్చుకున్నాడు అనేది కూడా క్లారిటీగా అనిపించదు.
తీర్పు :
ఫైనల్ గా చెప్పాలి అంటే, ఈ గోవిందా నామ్ మేర మూవీ కొద్దిపాటి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో పర్వాలేదనిపిస్తుంది. చివరి నలభై నిముషాలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే మరింత ఆసక్తికర స్క్రీన్ ప్లే కనుక దర్శకడు రాసుకుని ఉంటె మొత్తంగా ఈ మూవీ మంచి సినిమాగా ఆడియన్స్ ని అలరించేది, కానీ ఆ స్థాయి ఆకట్టుకునే అంశాలు లేకవడంతో కేవలం జస్ట్ ఓకే అనే మూవీ దగ్గరే ఆగిపోయింది. ఈవారం రిలీజ్ అయిన సినిమాల్లో పర్వాలేదు ఒకసారి అలా చూసేయొచ్చు అనుకుంటే ఈ మూవీ చూడండి.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team