అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం జి.పి.ఎల్. అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా రావు జి.ఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. పవన్ శంకర్, యాని, తనికెళ్ళ భరణి, హెబ్బా పటేల్, బ్రహ్మాజీ, నాగ మహేష్, నవీన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
లవ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్ మరియు వైజాగ్, కోడై కెనాల్‌లలో షూటింగ్ జరుపుకోనుంది. నవంబర్ 14 నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ రావు జి.ఎం.నాయుడు మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) టైటిల్ ఈ కథకు సరిగ్గా సరిపోతుంది. మనం ఏదైనా పైన ఉన్న భగవంతుడి ఆదేశాల మేరకు నడుస్తాము అనే పాయింట్‌తో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది’ అని తెలిపారు.
నిర్మాత అల్లు సాయి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. లవ్, సస్పెన్స్ తో కూడిన ఈ సినిమా షూటింగ్ సింగల్ షెడ్యూల్లో పూర్తి చేయబోతున్నాం. మాకు సహకరిస్తున్న మీడియా వారందరికీ ప్రేత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.