“దేవర” ట్రైలర్ రిలీజ్ అక్కడేనా!?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కి ఆల్రెడీ సాలిడ్ రెస్పాన్స్ నమోదు అవుతుంది. ఇక ట్రైలర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ ఈ సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తారు అన్నట్టుగా ప్రస్తుతం రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

అయితే ఇప్పుడు దీనిపై మరో డీటెయిల్ తెలుస్తోంది. దేవర ట్రైలర్ లాంచ్ కి మేకర్స్ గ్రాండ్ ప్లానింగ్స్ చేస్తున్నారట. జెనరల్ గా ఆన్లైన్ లో వదిలేయడం కాకుండా ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టి అక్కడ నుంచి ట్రైలర్ వదలనున్నారట. మొత్తానికి అయితే ట్రైలర్ తో పాటుగా ప్రమోషన్స్ ని ఇక్కడ నుంచే స్టార్ట్ చేయనున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Exit mobile version