టీవీ క‌ళాకారుల సంక్షేమ‌మే ‘జీఎస్ హ‌రి ప్యానెల్’ ధ్యేయం

టీవీ క‌ళాకారుల సంక్షేమ‌మే ‘జీఎస్ హ‌రి ప్యానెల్’ ధ్యేయం

Published on Jan 29, 2025 9:41 AM IST

తెలుగు టెలివిజ‌న్ ఆర్టిస్ట్స్ అసోషియేష‌న్ (Artists Association of Telugu Television (AATT) కార్యవ‌ర్గం ఎన్నికలు ఈ నెల 31న జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఫిలించాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మ‌వేశంలో జీఎస్ హ‌రి ప్యానెల్ స‌భ్యులు మేనిఫెస్టో విడుద‌ల చేశారు. త‌మ జీఎస్ హ‌రి ప్యానెల్ గెలిస్తే.. తెలుగు టెలివిజ‌న్ ఆర్టిస్టుల‌కు ప‌లు ప్రయోజ‌నాలు అమ‌లు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు.

జీఎస్ హ‌రి ప్యానెల్ మేనిఫెస్టో :

1. ఒక్కో తెలుగు సీరియ‌ల్‌లో ఒక్క ప‌ర భాష ఆర్టిస్ట్ కి మాత్రమే అనుమ‌తి
2. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ ప‌ద్దతిని నిర్మాత‌లు, ఛాన‌ల్స్‌తో మాట్లాడి రద్దు చేస్తాం
3.అర్హులైన పేద క‌ళాకారుల‌కు పెన్షన్‌లు
4. మెడిక్లైమ్ పాల‌సీ 3 ల‌క్షల నుండి 5 ల‌క్షల‌కు పెంపు
5. నాగ‌బాబు గారి స‌హ‌కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ న‌గ‌ర్ కృషి
6. 3. స్త్రీ స‌భ్యుల‌కు ప్రత్యేక ర‌క్షణ క‌ల్పిస్తాం.
7. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మ‌న తెలుగు టీవీ క‌ళాకారుల‌కు అమ‌లు
8. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా మ‌న స‌భ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేష‌న్ కార్డుల కోసం ప్రయ‌త్నం
9. టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛాన‌ల్స్ వారికి, కొత్త తెలుగు క‌ళాకారుల‌కు మ‌ధ్య వార‌ధిలా వ్యవ‌హ‌రిస్తాం.
10. ఈఎస్ఐ స్కీం వ‌ర్తింప చేస్తాము
11 ప్రావిడెంట్ ఫండ్ స్కీం అమ‌లు చేస్తాం
12. ప్రతి మెంబ‌ర్‌కి వ‌ర్క్ క‌ల్పిస్తాం

ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ టీవీ న‌టుడు విజ‌య్ యాద‌వ్ మాట్లాడుతూ.. ‘టెలివిజ‌న్ క‌ళాకారుల సంక్షేమ‌మే ధ్యేయంగా వినోద్ బాల గారి ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం మా తెలుగు టెలిజ‌విన్ ఆర్టిస్టు అసోషియేష‌న్ అసోసియేషన్‌ను ప్రారంభించాము. ఇప్పటి వ‌ర‌కు ఎన్నో కార్యక్రమ‌లు చేశామ‌ని ఘ‌నంగా చెప్పగ‌లుగుతున్నాం. మా అసోసియేషన్‌కు మాత్రమే సొంత బిల్డింగ్ ఉంది. వంద‌లాది మంది ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించాం. మెడిక్లెయిమ్ చేయించాము. తెలుగు ఆర్టిస్టుల‌కు మాత్రమే అవ‌కాశాలు ఇవ్వాల‌నేదే మా ప్రయ‌త్నం. సీరియ‌ల్ షూటింగ్ టైమింగ్ విషయాలపై మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. కరోనా సమయంలో చిరంజీవి గారి ట్రస్ట్, అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ల సహకారంతో ఆర్టిస్టులంద‌రికి సహాయం చేశాం. పేద కళాకారులకు పెన్షన్ ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. స‌మ‌ర్థులైన జీఎస్ హ‌రి ప్యానెల్ స‌భ్యులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే టెలివిజ‌న్ క‌ళాకారుల స‌మస్యలు తీర్చుతూ, సంక్షేమంపై దృష్టిపెడ‌తాము.’ అని అన్నారు.

జీఎస్ హ‌రి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హ‌రి మాట్లాడుతూ.. నటుడుగా ఒక ద‌శ‌లో నా జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో నన్ను ఆదుకుని నా నట జీవితాన్ని నిలబెట్టింది ఈ టెలివిజ‌న్ రంగం. ఈ రంగానికి పెద్ద దిక్కుగా మిత్రులు విజయ్ యాదవ్ గారు, వినోద్ బాల గారు అంద‌రికి స‌పోర్టుగా నిలుస్తున్నారు. అర్ధరాత్రి తలపు తట్టిన కూడా ఆదుకునే మంచి మ‌న‌సున్న వారు. కరోనా సమయంలో పెద్దలు చిరంజీవి గారు, త‌ల‌సాని శ్రీనివాస్ గారి స‌హ‌కారంతో ఇంటింటికి నిత్యావసర వస్తువులు అందించే బాధ్యత తీసుకున్నది మ‌న అసోషియేష‌న్‌ది. నిరంత‌రం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామ‌ని గ‌ర్వంగా చెప్పగ‌ల‌ను. విజయ్ యాదవ్ గారు, వినోద్ బాల గారి ఆధ్వర్యంలో నా మీద నమ్మకంతో నాకు అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. నాకు అన్నం పెట్టిన ఈ పరిశ్రమ సంక్షేమం కోసం నేను నిరంత‌రం ప్రయత్రిస్తానని ఈ సంద‌ర్బంగా హామీ ఇస్తున్నాను. ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) అభ్యర్థి గుత్తికొండ భార్గవ త‌మ జీఎస్ హ‌రి ప్యానెల్ నుంచి మేనిఫెస్టో విడుద‌ల చేశారు. తమ ప్యానెల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు