IPL 2025 : గుజరాత్ టైటాన్స్‌ దూకుడికి చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్

IPL 2025 : గుజరాత్ టైటాన్స్‌ దూకుడికి చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్

Published on Apr 9, 2025 11:43 PM IST

ఐపీఎల్ 2025 లో భాగంగా జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం వారికి ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి. ఇక బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ మరోసారి తన భీకర ఫామ్‌తో చెలరేగాడు. సాయి సుదర్శన్ 53 బంతుల్లో 82 పరుగులతో గుజరాత్ టైటాన్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, అతనికి తోడుగా జోస్ బట్లర్(36), షారుఖ్ ఖాన్(36) కొంత సాయం అందించారు. వరుస వికెట్లు పడుతున్నా, చివర్లో వచ్చిన రాహుల్ తివాటియా (24 నాటౌట్), రషీద్ ఖాన్(12) పరుగులు చేసి జట్టు స్కోరును 6 వికెట్ల నష్టానికి 217 పరుగులకు తీసుకెళ్లారు.

ఇక 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శామ్సన్(41), రియాన్ పరాగ్(26), షిమ్రోన్ హిట్మెయిర్(52) పరుగులతో లక్ష్యాన్ని చేధించేందుకు ప్రయత్నించారు. కానీ, మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవరూ రెండంకెల స్కోర్ కూడా చేయకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లకు 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు