‘జాన్వీ కపూర్‌’ గురించి తప్పుగా మాట్లాడలేదట

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ తో నటుడు గుల్షన్‌ దేవయ్య ‘ఉలఝ్‌’ అనే చిత్రంలో కలిసి నటించారు. ఐతే, గుల్షన్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జాన్వీతో తనకు ఫ్రెండ్లీ రిలేషన్‌ లేదని, చివరకు సన్నివేశాల చిత్రీకరణ సమయంలో కూడా తనతో ఆమె మాట్లాడేదని గుల్షన్‌ దేవయ్య చెప్పుకొచ్చాడు. దీంతో, ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. జాన్వీకి పొగరు ఎక్కువ అంటూ కొందరు, గుల్షన్‌ కి సపోర్ట్ గా పోస్ట్ లు పెట్టారు.

ఈ నేపథ్యంలో గుల్షన్‌ దేవయ్య ఈ వివాదం పై మళ్లీ క్లారిటీ ఇస్తూ.. ‘నిజానికి నేను జాన్వీ గురించి తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదు అని చెప్పాను. అది మా ఇద్దరి తప్పు కాదు కదా. జాన్వీ కపూర్ చాలా మంచి నటి. ఆమె ప్రొఫెషనల్‌గా ఉంటుంది. నేను ఆమెను కించపరచలేదు. ఉద్దేశపూర్వకంగా ఆమె గురించి తప్పుగా మాట్లాడలేదు’ అంటూ గుల్షన్‌ తెలిపాడు.

Exit mobile version