మరో రిస్క్ చేసేందుకు సిద్దమైన గుణశేఖర్ !

మరో రిస్క్ చేసేందుకు సిద్దమైన గుణశేఖర్ !

Published on Dec 7, 2016 4:52 PM IST

guna-shekar
2015వ సంవత్సరంలో అనుష్క ప్రధాన పాత్రలో ‘రుద్రమదేవి’ వంట సాహసోపేతమైన చారిత్రక చిత్రం చేసిన దర్శకుడు గుణశేఖర్ చాలా కాలం తరువాత మరో రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఆయన రిస్క్ చేయబోయేది చరిత్రతో కాదు పురాణ గాథతో. అవును గుణశేఖర్ ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ ల పురాణ గాధను సినిమాగా తీయనున్నాడట. అందుకోసమే తాజాగా ఫిల్మ్ చాంబర్స్ లో ‘హిరణ్యకశ్యప’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.

భారత పురాణ గాథల్లో ఒకటైన ఈ కథ గురించి అందరికీ తెలుసు. పైగా దీని మీద 1967లో వచ్చిన ‘భక్త ప్రహల్లాద’ చిత్రం ఇండియన్ సినిమాలోని క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. అలాంటి గొప్ప కథను ఎంచుకున్న గుణశేఖర్ ఏ రీతిలో సినిమాని తీస్తాడో అని అందరూ కొందరు చర్చించుకుంటుండగా మరికొందరు ‘రుద్రమదేవి’ని బాగానే హ్యాండిల్ చేశాడు కాబట్టి ఈ ప్రాజెక్టుని కూడా బాగానే తీస్తాడని అనుకుంటున్నారు. మరోవైపు ఇంత చర్చ జరుగుతున్నా కూడా గుణశేఖర్ ఈ అంశం మీద ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం మరింత ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు