‘యుఫోరియా’ షూటింగ్ ప్రారంభించిన గుణ‌శేఖ‌ర్

ద‌ర్శ‌కుడు గుణశేఖ‌ర్ ఇటీవ‌ల తాను ‘యుఫోరియా’ అనే సినిమాను తెర‌కెక్కించబోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ సినిమాను ఆయ‌న ఎవ‌రితో చేస్తాడా అనే ఆస‌క్తి అభిమానుల్లో ఏర్ప‌డింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను గుణ‌శేఖ‌ర్ ప్రారంభించారు.

ఈ సినిమాను పూజా కార్య‌క్ర‌మాల‌తో గుణ‌శేఖ‌ర్ మొద‌లుపెట్టారు. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘యుఫోరియా’ సినిమా ముహూర్తం జ‌రిగిన‌ట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే, ఈ సినిమాలో నటీన‌టులు ఎవ‌ర‌నే విష‌యంపై మేక‌ర్స్ ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

కాగా, ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తుండ‌గా, నీలిమ గుణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గుణ హ్యాండ్ మేడ్ ఫిలింస్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Exit mobile version